టిడిపి అధికారంలో పులి.. వైసిపి రాగానే పిల్లి పరార్... పట్టుకో పట్టుకో ఎవరా నేత?

గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:10 IST)
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆయనే కింగ్. ఎమ్మార్వోను దూషించినా, ప్రభుత్వఅధికారులను నానా మాటలన్నా, జగన్ పైన తీవ్ర విమర్సలు చేసినా.. ఏం చేసినా సరే ఆయనకే చెల్లుబాటు అయ్యేది. అధినాయకత్వం కూడా ఆయన గురించి పెద్దగా పట్టించుకునేది కాదు. కింగ్.. కింగ్ మేకర్‌గా ఉన్న నేత కాస్తా ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు.
 
ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా. చింతమనేని ప్రభాకర్. అసలు ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. టిడిపి హయాంలో చింతమనేని ప్రభాకర్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సైలెంట్ అయిపోయి తన పనులు తాను చేసుకుంటూ ఎవరితో గొడవపడకుండా ఉంటూ వచ్చిన చింతమనేని ఒక కేసులో ఇరుక్కుని తప్పించుకు తిరుగుతున్నారు.
 
గత నెల 29వ తేదీన అసైన్డ్ భూమిలో ఇసుకను తీసుకెళ్ళి ఇంటిని నిర్మించుకునేందుకు ప్రయత్నించాడు చింతమనేని ప్రభాకర్. అయితే అక్కడున్న స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో కులం పేరుతో వారిని దూషించారు చింతమనేని ప్రభాకర్. వారు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
 
దీంతో చింతమనేని కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన కోసం పోలీసులు వెతుకున్నారు. అయితే హైకోర్టుకు వెళ్ళి లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టిడిపి హయాంలో పులిలాగా ఉన్న చింతమనేని ప్రభాకర్ వైసిపి అధికారంలోకి రాగానే పిల్లిలాగా మారిపోయాడంటూ ప్రచారం జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లెనోవో కె10 - జడ్6 ప్రో ఫీచర్స్ అదుర్స్...