రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (16:41 IST)
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హత్యకు తెలుగుదేశం నాయకత్వం కుట్ర పన్నిందని టాలీవుడ్ కమెడియన్, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. "అతడిని అంతమొందించే ప్లాన్ గురించి నా దగ్గర గట్టి సమాచారం ఉంది" అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఒక ప్రముఖ జర్నలిస్ట్ కొడుకు అనిల్ ఈ పథకాన్ని రూపొందించాడు. "నేను టీడీపీకి సన్నిహితంగా ఉన్న కొన్ని కమ్మ మూలాల ద్వారా దాని గురించి తెలుసుకున్నాను," అని పోసానీ చెప్పారు. 
 
సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన, అనిల్ తన ప్లాన్‌ను టీడీపీ నేత రాజేష్ కిలారుతో పంచుకున్నారని.. ఆ తర్వాత ఆయన తనయుడు నారా లోకేష్‌తో చర్చించారని చెప్పారు. ఆర్జీవీని ఎలిమినేట్ చేసేందుకు లోకేష్ కూడా ఆమోదం తెలిపారని ఆరోపించారు. 
 
ఇంకా పోసాని మాట్లాడుతూ, ఆర్జీవి చంపడం ద్వారా ఒరిగేదేమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆర్జీవీ హత్యను అడ్డుకున్నారని చెప్పారు. తాను తప్పు అయితే కేసు కూడా పెట్టుకోవచ్చునని పోసాని సవాల్ విసిరారు.
 
జగన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారని పోసాని విమర్శించారు. "తన నలుగురు భార్యల గురించి జగన్ ప్రస్తావించడంతో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అవును, మీకు ముగ్గురు కాదు నలుగురు భార్యలు ఉన్నారు. నిజానికి మీకు ఐదో భార్య వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది" అని ఆయన ఆరోపించారు. బెజవాడ కనకదుర్గమ్మ సాక్షి, తల్లీ, భార్య, బిడ్డల సాక్షిగా చెప్తున్నా ఇది నిజమని పోసానీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments