Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 114.7 కోట్లు, అప్పులు రూ. 64.26 కోట్లు, కట్టిన పన్ను రూ. 73 కోట్లు

ఐవీఆర్
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (16:27 IST)
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈరోజు నామినేషన్ దాఖలు చేసారు. ఇందులో భాగంగా ఆయన అఫిడవిట్ ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా వున్నాయి. గత ఐదేళ్లలో పవన్ 114.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారని స్వయంగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అఫిడవిట్‌లోని ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తను 73 కోట్ల రూపాయల పన్ను చెల్లించానని పవన్ ప్రకటించారు.
 
బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారునిగా ఉండాలని పవన్ ఎప్పుడూ నొక్కి చెబుతుంటారు. ఈ గణాంకాలు చూస్తే అది నిరూపితమైనట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళంతో సహా పవన్ ఛారిటబుల్ ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌లకు 20 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అప్పుల విషయానికి వస్తే, పవన్ ఇప్పటి వరకు 64.26 కోట్ల రూపాయల భారీ అప్పులు తీసుకున్నారు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని చిత్ర నిర్మాతల నుండి తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ గారి నుంచి 2 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరు మీద నాలుగు వ్యవసాయ భూములు ఉన్నాయి. మంగళగిరిలో 4, తెలంగాణలో 3, హైదరాబాద్‌లో రెండు రెసిడెన్షియల్ భవనాలు అతని పేరు మీద వున్నాయి. భార్య అన్నా పేరు మీద ఒకటి వుంది. ఆటోమొబైల్స్ విషయానికి వస్తే... తన పేరు మీద రేంజ్ రోవర్, బెంజ్ మేబ్యాక్ సహా తొమ్మిది కార్లను రిజిస్టర్ చేసుకున్నారు. వాటిలో కొన్ని ఖరీదైన విలాసవంతమైన కార్లున్నాయి. పవన్ కల్యాణ్‌కు ఎంతో ఇష్టమైన హార్లీ డేవిడ్‌సన్ బైక్, అతని పేరు మీద పికప్ వ్యాన్ కూడా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎన్నికల ప్రచారానికి ఆయన వాడుతున్న ప్రసిద్ధ వారాహి వాహనం ఆయన ఆస్తుల జాబితాలో లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments