Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపి నాయకులపై పైచేయి సాధిస్తున్న PK టీం, జగన్ అలా చెప్పేస్తున్నారట...

ఎపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ చేపట్టిన పాదయాత్రపై ఆ పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యాత్ర మొదలై చాలా రోజులవుతున్నా ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే మొత్తం పాదయాత్ర కొనసాగుతోంది. బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని జగన్ పాదయాత్ర వెంటే పి.కె.టీం ముం

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (20:26 IST)
ఎపి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ చేపట్టిన పాదయాత్రపై ఆ పార్టీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యాత్ర మొదలై చాలా రోజులవుతున్నా ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే మొత్తం పాదయాత్ర కొనసాగుతోంది. బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని జగన్ పాదయాత్ర వెంటే పి.కె.టీం ముందుకు సాగుతోంది. రూట్ మ్యాప్‌తో పాటు, ప్రసంగాలు ఏ ప్రాంతంలో ఏం మాట్లాడాలో స్ట్రిప్టులు ఇస్తున్నారు. 
 
అంతేకాదు ప్రజా సమస్యలపై జగన్ మాట్లాడిన ప్రసంగాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి పి.కె.టీం ఒకరు, మరోవైపు ఏం మాట్లాడారన్న దానిపై ఒక బృందం స్క్రిప్టు ఇవ్వడం, మరో టీం అక్కడ జరుగుతున్న మొత్తం వ్యవహారాలను పి.కె.కు, జగన్‌కు ఎప్పటికప్పుడు చెబుతుండటం ఇలా మూడు బృందాలుగా ఏర్పడి పి.కె.టీం ముందుకు సాగుతోంది. అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ టీంకు, వై.సి.పినేతలకు మధ్య గొడవ జరుగుతోందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో వైసిపి నేతలు తాము చెప్పినట్లు కొన్ని విషయాలను మాట్లాడాలని జగన్‌ను పట్టుబట్టే ప్రయత్నం చేస్తున్నా అందుకు పి.కె.టీం సభ్యులు ఓప్పు కోవడం లేదు.
 
దీంతో ఇద్దరి మధ్యా క్లాష్ అవుతోంది. ఇది కాస్త జగన్‌కు తెలిసింది. కానీ ప్రశాంత్ కిషోర్ పైన జగన్ నమ్మకం పెట్టడంతో ఇక పార్టీ నేతలనే సైలెంట్‌గా ఉండమని ఆదేశాలిస్తున్నట్లు సమాచారం. మరి ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు ఏ మాత్రం జగన్ మోహన్ రెడ్డికి ఉపయోగపడుతాయో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments