Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుక్క తోక వంకర Vs బురదలో దొర్లిన పందులు.. అసెంబ్లీలో బుచ్చయ్య-నానిల వార్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎక్కడపడితే అక్కడ వైకాపా- టీడీపీ నేతలు సమరానికి సై అంటున్నారు. అసెంబ్లీ ప్రాంగణం, మీడియా పాయింట్ వద్ద వైకాపా-టీడీపీ నేతల మధ్య వార్

కుక్క తోక వంకర Vs బురదలో దొర్లిన పందులు.. అసెంబ్లీలో బుచ్చయ్య-నానిల వార్
, మంగళవారం, 21 మార్చి 2017 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎక్కడపడితే అక్కడ వైకాపా- టీడీపీ నేతలు సమరానికి సై అంటున్నారు. అసెంబ్లీ ప్రాంగణం, మీడియా పాయింట్ వద్ద వైకాపా-టీడీపీ నేతల మధ్య వార్ జరిగింది. అలాగే అసెంబ్లీలోనూ... ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ ఆసాంతం గందరగోళంగానే నడుస్తున్న పరిస్థితి నెలకొంది. 
 
మంగళవారం ఉదయం నుంచే సభ ప్రారంభమై ఓసారి వాయిదా పడింది. ఆపై ప్రారంభమైన సభలో టీడీపీ ఎమ్మెల్యే అనిత, గిడ్డి ఈశ్వరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. వైసీపీ ఆందోళనల మధ్య సభ మరోమారు వాయిదా పడింది. ఆ తర్వాత ప్రారంభమైనా.. ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం మాత్రం ఆగలేదు. జగన్ ఆస్తులపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతున్న వేళ.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీని ఎద్దేవా చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. 
 
'కుక్క తోక వంకరలా..' ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనడంతో సభలో మరింత దుమారం రేగింది. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. అధికార పార్టీ సభ్యులు బురదలో దొర్లిన పందుల్లా వ్యవహరిస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు నాని వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
దీంతో మధ్యలో కల్పించుకున్న స్పీకర్.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరారు. స్పీకర్ ఆదేశంతో కొడాలి నాని స్పందిస్తూ..'అధ్యక్షా.. తాను వ్యక్తిగతంగా విమర్శించలేదు.. ఆయన మమ్మల్ని కుక్క తోక వంకర అని అన్నారు. తాను బురదలో దొర్లిన పందుల్లా వ్యవహరిస్తున్నారని చెప్పాను. ఇందుకు ఆయన బాధపడి ఉంటే తాను తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాను. కానీ.. బుచ్చయ్య కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోమనండి అంటూ పట్టుబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు రూ.43కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే.. టీడీపీకే రాసిచ్చేస్తా!:జగన్ సవాల్.. నోరు జారిన బాబు