Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం.. ఎవరు?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:14 IST)
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అనుభవం వుండి ఏం లాభం అంటూ ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఏమైందంటూ ప్రశ్నించారు. 
 
అంతేగాకుండా కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ సీఎం జగన్‌ను అభ్యర్థించారని పేర్నినాని గుర్తు చేశారు. 1979 నాటికే 13 జిల్లాలు ఏర్పడినప్పుడు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత జనాభా పెరిగింది, ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి? ఆ మాత్రం తెలియదా? అంటూ పేర్నినాని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
పనిలో పనిగా పవన్‌పై కూడా ధ్వజమెత్తారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంత… చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇస్తే పవన్ ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా? నిలదీశారు. చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడు? అంటూ పవన్‌పై పేర్ని నాని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments