Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిహారికపై పవన్ కల్యాణ్ ట్వీట్.. పరోక్షంగా ఏమన్నారు..?

Advertiesment
Pawan Kalyan
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (12:42 IST)
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో నిహారిక కొణిదెల కూడా ఉన్నట్లు ప్రచారం జరగడం... పోలీస్ స్టేషన్ నుంచి నిహారిక బయటకొస్తున్న దృశ్యాలు మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం తెలిసిందే. 
 
శనివారం బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌‌పై పోలీసులు దాడి చేయడంతో ఈ దాడిలో పలువురు మెగా డాటర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. 
 
నిహారిక అరెస్టు కావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ ఘటనపై నాగబాబు స్పందించి తన కూతురు గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇవన్నీ కేవలం అసత్య ప్రచారాలు అంటూ చెప్పుకొచ్చారు.
 
నాగబాబు తన కూతురు గురించి సమర్థించుకున్నా మెగా అభిమానులు మాత్రం నిహారికపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిహారిక వ్యవహారశైలిపై తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందిస్తూ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది. అవతలివారు మనల్ని వాడుకోవడం కూడా మన విజయమే అనే భ్రమలో ఉండటం కూడా అమాయకత్వమే అని ట్వీట్ చేశారు.
 
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పవన్ కళ్యాణ్ పరోక్షంగా నిహారిక‌పై స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు. 
 
నిహారిక అరెస్టు కావడంతో శత్రువులకు బలమైన ఆయుధంగా మారిందని పవన్ కళ్యాణ్ పరోక్షంగా చెబుతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వంత్, శుభశ్రీ జంట‌గా సాయి స్రవంతి మూవీస్ చిత్రం