Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కంట్లో కారం కొట్టిన తల్లి.. చెట్టుకు కట్టేసి..?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (17:26 IST)
గంజాయికి అలవాటు పడి, రాత్రిపగలు అనే తేడా లేకుండా మత్తులో మునిగిపోతూ.. ఊరిలో తమ పరువు తీస్తున్నాడని తల్లి కొడుకు కండ్లకు కారం పెట్టిన సంఘటన సంచలనంగా మారింది.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.  వివరాల్లోకి వెళితే...  తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ విషయం తల్లికి తెలవడంతో గంజాయి మానుకోవాలని కొడుకును హెచ్చరించింది. 
 
అయినా, తల్లి మాటను పట్టించుకోకుండా ఆ యువకుడు గంజాయి విషయంలో తగ్గేదేలే అంటూ స్నేహితులతో కలిసి మరింతగా అలవాటుపడి, ఊరిలోని పలు గల్లీల్లో అల్లర్లు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడికి ఆతడి తల్లి తగిన విధంగా బుద్ధి చెప్పింది. 
 
దీంతో ఆగ్రహించిన తల్లి.. కొడుకు ఇంటిలో ఉన్న సమయంలో వీధిలోకి తీసుకొచ్చి, అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టేసి, ఎర్రని కారాన్ని కండ్లలో పెట్టింది. 
 
దీంతో ఆ యువకుడు బోరుమని ఏడుస్తూ, అమ్మ మళ్లీ గంజాయి జోలికి పోనూ, నన్ను వదిలేయ్ అంటూ అరుపులు పెట్టాడు. అయినా, తల్లి కనికరించకుండా మరింత కారం పెడుతూ, కొడుకుకి సరైన బుద్ది చెప్పింది.
 
ఈ ఘటనను వీక్షిస్తున్న అక్కడివారు వీడియోను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments