Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ మధ్యలో ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతుంటే.. గమనించారా? జర్నలిస్టులకు పవన్ ప్రశ్న

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (16:03 IST)
మీ మధ్యలో ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతుంటే మీరు ఏమాత్రం పట్టించుకోకుండా నా నుంచి న్యూస్ బైట్స్ తీసుకునేందుకే ప్రధాన్యత ఇస్తున్నారేగానీ మీ సాటి మహిళా విలేఖరి నలిగిపోతున్న అంశం మీలో ఏ ఒక్కరూ గుర్తించలేదని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మహిళలపై, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇస్తారా అని ఓ రిపోర్టర్ ప్రశ్న సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. 
 
మీరు ఇపుడు ఆత్మరక్షణ కోసం ప్రశ్న అడుగుతున్నారు. ఇక్కడ చాలా మంది పాత్రికేయులు తనను ప్రశ్నలు అడిగేందుకు వచ్చారు. మీ మధ్యలో ఇందాకటి నుంచి ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతూ ఉంది. మీరు నా నుంచి న్యూస్ బైట్ తీసుకోవాలనే హడావుడిలో ఉన్నారేగానీ మీ సాటి మహిళా విలేకరి నలిగిపోతున్న విషయం గుర్తించలేదన్నారు. 
 
ముందు మనలోనే సామాజిక స్పృహ ఉండాలి. మన కళ్లముందు ఏదైనా ఘటన జరిగినపుడు పోలీసులు వచ్చేలోపు ఆ ఘటనను వీడియోలు తీస్తుంటారే తప్ప, వెళ్లి ఆ ఘటనను అడ్డుకోవాలని అనుకోరు. మొదట ఈ విషయంలో సామాజిక స్పృగ కలగాలి. సమాజంలో ఈ తరహా ఆలోచనా ధోరణి వచ్చిన రోజున ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. 
 
తన సినిమా షూటింగుల సమయంలో కూడా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాను. ఇపుడు కూడా మీ మధ్యలో ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతుంటే గుర్తించి ముందుకు రామ్మా అని చెప్పాను. ఇది కనీస ధర్మం. ప్రతి ఒక్కరూ ఈ గుణాన్ని అలవర్చుకోవాలి అంటూ జర్నలిస్టులకు హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments