Webdunia - Bharat's app for daily news and videos

Install App

21వ తేదీన నరసాపురంలో శ్రీ పవన్ కల్యాణ్ బహిరంగ సభ, ఏంటి సంగతి?

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (20:20 IST)
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొని ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు శ్రీ పవన్ కల్యాణ్ గారి పర్యటన, కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు.


21వ తేదీ మధ్యాహ్నం 3గం.కు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ మొదలవుతుంది. ఆ రోజే ప్రపంచ మత్స్య దినోత్సవం. శ్రీ పవన్ కల్యాణ్ గారు పలు వేదికలపై మత్స్యకారుల అభివృద్ధి గురించి కాంక్షించారు. పోరాట యాత్రకు గంగ పూజ చేసి శ్రీకారం చుట్టింది మత్స్యకారుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా కపాసుకుర్ది తీరంలోనే.


నరసాపురంలోని బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను జిల్లా నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలను సైతం ప్రస్తావిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments