Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (18:19 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. ఆయన వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంటున్న చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరాగ పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కాగా, హైదరాబాద్ నగరంలో ఉన్న చంద్రబాబు నాయుడు గురువారం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు వైద్య పరీక్షలు చేయించుకుని శుక్రవారం విడుదలయ్యారు. అలాగే, శనివారం హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి వెళ్లి కంటి వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి వచ్చారు. చంద్రబాబుకు మంగళవారం కంటికి సంబంధించిన ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయి. పది అంశాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించే అంశాలపై వారిద్దరూ చర్చించినట్టు సమాచారం. అలాగే, వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) రూపకల్పన విషయం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ చర్చించారు. అలాగే, టీడీపీ, జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాల ఏర్పాటు అంశం కూడా వారిద్దరిమధ్య ప్రస్తావనకు వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జయహో రామానుజ సినిమా పాటలు తిలకించి మెచ్చుకున్న తెలంగాణ మంత్రులు

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments