Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు కంటి సమస్యలు.. ఆపరేషన్ చేయించుకుంటారా?

Chandra Babu
, శనివారం, 4 నవంబరు 2023 (08:44 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేరారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 
 
ఆపై డిశ్చార్జ్ అయ్యారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సమస్యలకు చంద్రబాబు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. 
 
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ కే రాజేశ్‌ ఆధ్వర్యంలో జనరల్‌ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్యుల బృందం కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తం, మూత్ర పరీక్షలు, 2డీ ఎకో, ఈసీజీ, అలర్జీ వంటి పలు పరీక్షలను సూచించింది. చంద్రబాబుకు స్క్రీనింగ్ మొదలైనవి చేశారు. 
 
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. తీవ్రమైన అలర్జీ, ఇతర వైద్యపరమైన కారణాలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AIతో కష్టాలే.. రిషి సునక్‌తో ఎలెన్ మస్క్ భేటీ.. మానవుడి కంటే తెలివైనది!