Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు... టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌‌మెంట్‌కు చర్యలు

apcid police
, గురువారం, 2 నవంబరు 2023 (13:14 IST)
ఫైబర్‌నెట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ అధికారుల ప్రయత్నానికి హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. దీంతో ఈ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అదేసమయంలో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. 
 
ఇందులోభాగంగా, టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు చేసిన ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర హోం శాఖ సైతం ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సీఐటీ అధికారులు ఆస్తులు అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన తర్వాత ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
మరోవైపు, సీఐడీ అటాచ్ చేయాలని భావిస్తున్న టెరాసాఫ్ట్‌కు చెందిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్టణంలోని ఓ ఫ్లాట్, హైదరాబాద్ నగరంలోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణ, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆహ్వానించిన ఫైబర్ నెట్ టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌కు ఆయాచిత లబ్ధికోసం కట్టబెట్టారన్నది సీఐడీ ఆరోపిస్తూ, కేసు నమోదు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రిస్తున్న మామను సజీవంగా దహనం చేసేందుకు కోడలి యత్నం.. ఎక్కడ?