Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుపై మరో కేసు.. మళ్లీ అరెస్ట్ చేయనున్న ఏపీ సర్కారు

Advertiesment
Babu
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే.. తల నరికేస్తామన్నారు-బండి సంజయ్