Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైలులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు!!

chandrababu
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:43 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. 73 యేళ్ల చంద్రబాబుకు కంటి సమస్యలతో పాటు ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. పైగా, సత్వరమే కుడికంటికి ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్యశాల నిపుణులు సూచించగా.. ఆయనకు వెంటనే వివిధ రకాల వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. 
 
చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ చెందిన వైద్య నిపుణులు ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ నెల 21వ తేదీన ఒక నివేదికలో వివరించారు. అదేవిధంగా చంద్రబాబు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుప బుధవారం ఆయనను పరీక్షించిన ప్రభుత్వ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను బట్టి తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, ఆయన వెన్నుకింది భాగంలో నొప్పి, మలద్వారం వద్ద నొప్పి, అసౌకర్యంతో బాధపడుతున్నారని, ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్టులు, లివర్ ఫంక్షన్ టెస్టులు, సీరం ఎలక్ట్రోలైట్స్, కోగ్యులేషన్ ప్రొఫైల్, హెచ్బీఏ1సీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఈసీజీ, ఎక్స్-రే చెస్ట్, 2డీ ఎకో వంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 
 
చంద్రబాబు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు చల్లటి వాతావరణాన్ని కొనసాగించాలని, శరీరానికి బాగా గాలి తగిలే దుస్తులు ధరించాలి, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవద్దని, సౌకర్యంగా ఉండే కుర్చీని వాడాలని వారు పేర్కొనట్లు తెలిసింది. అయితే, జైలు అధికారులు, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇవేమీ పట్టించుకోనట్టు తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌: రూ.5వేలు పెట్టుబడి.. 3లక్షలు డిపాజిట్ చేస్తారు..