Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు కరోనా నెగెటివ్?.. అయినా సెల్ఫ్ ఐసోలేషన్‌లోనే

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:25 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహిచిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ... వైద్యుల సూచన మేరకు మరో వారం పది రోజుల పాటు తన వ్యవసాయ క్షేత్రంలోనే హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు. 
 
కాగా, ఇటీవల పవన్ కళ్యాణ్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ కోవిడ్ బారినపడ్డారనే వార్త బయటకు రాగానే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. కొంతమంది అభిమానులు, జన సైనికులు సైతం పూజలు నిర్వహించారు. 
 
పవన్ ఆరోగ్యం బావుండాలని.. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించారు. వారందరి పూజలు ఫలించాయి. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు నెగిటివ్‌గా నిర్దారణ అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. 
 
హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. పవన్‌కు కరోనా లక్షణాలు చాలా స్వల్పంగానే ఉండటంతో... ఆయన త్వరగానే కోలుకున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో ఆసుపత్రి వైద్యులు గాని, జనసేన వర్గాలుగాని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments