భార్యకు విడాకులిచ్చాడు.. ప్రేమ చంపుకోలేక కిడ్నాప్ చేసిన భర్త....

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:21 IST)
కుటుంబ మనస్పర్థల కారణంగా కట్టుకున్న భార్యకు ఓ భర్త విడాకులిచ్చాడు. అయితే, ఆమెపై ప్రేమ మాత్రం చనిపోలేదు. దీంతో విడాకులు ఇచ్చిన బార్యను కిడ్నాప్ చేసేందుకు భర్త యత్నించాడు. ఈ కిడ్నాప్‌ ప్రయత్నంలో భాగంగా ఆమెపై దాడికూడా చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జూబ్లీహిల్స్‌లో నివాసముండే ఓ మహిళ కొద్ది కాలం క్రితం చావ వినయ్‌ చౌదరిని వివాహం చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భర్త గృహహింస పెడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ సమ్మతించి విడుకాలు తీసుకున్నారు. 
 
కానీ, భార్యపై భర్తకు ప్రేమ తగ్గలేదు. దీంతో ఈ నెల 18న వినయ్‌ ఆమె ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికులు వినయ్‌ను అడ్డుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిపై ఐపీసీ 448,354,427,506 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments