కరోనావైరస్‌ను కంట్రోల్ చేయలేకపోవడంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు. ప్రముఖ టెలివిజన్ ఛానల్ టీవి5తో ముఖాముఖి మాట్లాడిన ఆయన కరోనావైరస్ ఆవర్భవించి ఏడాది గడిచిన తర్వాత సెకండ్ వేవ్ వస్తుందని తెలిసి కూడా కుంభమేళాలు ఏంటండీ అని నిలదీశారు.
రాజకీయ సభలు పెట్టడాలు, ఓటర్లను సభలకు రప్పించి గొర్రెల మంద కింద ట్రీట్ చేశారంటూ విమర్సించారు. ఒకవైపు సామాన్య ప్రజానీకానికేమో... సామాజిక దూరం పాటించండి, మాస్కులు లేకుండా బయటకు రావద్దు, మాల్స్ బంద్, షాపులు బంద్ అంటారు. కానీ కుంభమేళాకు మాత్రం లక్షల మంది వస్తుంటే వదిలేస్తారు.
అదేమంటే దేవుడుపై విశ్వాసం అంటారు. అసలు కరోనావైరస్‌ను సృష్టించింది దేవుడు కాదా? కొంతమంది అనుకుంటున్నట్లు కలియుగంలో పాపం పెరిగిపోయింది కనుక వినాశనం సృష్టించేందుకు దేవుడే కరోనావైరస్ అనే బుల్లెట్టును వదిలాడు. ఆ కరోనావైరస్ బుల్లెట్ అక్కడా ఇక్కడా తిరిగి ఎటు పోదామా అని ఆలోచిస్తుంటే భారత్ వెళ్లి దాని ఎదురుగా నుంచుంది. ఇక ఆ కరోనాబుల్లెట్ దాని పని అదే చేస్తోంది అంటూ సెటైర్లు పేల్చారు.