Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నర్సాపురం - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై అడ్డుగా ఉన్న రైలు పట్టాలపై ముక్కను ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఇనుపముక్కం ఎగిరి పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. ట్రాక్‌పై రైలు పట్టా ముక్కను ఎవరు పెట్టారన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్యలో ముసునూరు వద్ద రైల్వే ట్రాక్‌పై దుండగులు రైలు పట్టాను పెట్టారు. దాదాపు రెండు మీటర్ల పొడవైన రైలు పట్టాను ట్రాక్‌కు అడ్డంగా పెట్టారు. అదే ట్రాక్‌పై నర్సాపూర్ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చింది.
 
రైలు పట్టాను ఢీ కొట్టగా.. ఆ వేగానికి రైలు పట్టా దూరంగా ఎగిరిపడింది. ఇలా ఎగిరి పక్కన పడడం వల్లే ప్రమాదం తప్పిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాను ట్రాక్‌పై పెట్టిన దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments