Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు బోగీలో చెప్పులతో కొట్టుకున్న మహిళలలు .. వీడియో వైరల్

Advertiesment
womens fight
, గురువారం, 13 జులై 2023 (11:56 IST)
కోల్‌కతాలో పరుగులు పెట్టే లోకల్ రైలులో కొందరు మహిళలు చెప్పులతో కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో సామాజికమాద్యం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్ అయింది. జూలై 11వ తేదీన ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికే 30 లక్షల మంది ఈ వీడియోను తిలకించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఇద్దరు మహిళలు ఒకవైపు, మిగిలిన మహిళలంతా మరోవైపు ఉన్నట్టు కనిపిస్తుంది. 
 
లోకల్‌ రైలులోని లేడీస్ బోగీలో మహిళలు గొడవలు పడుతున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. మహిళలు అరవడం, కేకలు వేయడం, ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకోవడం, పిడిగుద్దులు కురిపించడం, ఒకరి జట్లు ఒకరు పట్టుకుని లాగుతున్నట్టుగా కనిపిస్తుంది. వారి ప్రవర్తనను చూసిన కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
అయితే, ఈ గొడవకు గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు. ఈ ఘటనపై నెటిజన్లు తమదైమశైలిలో స్పందిస్తున్నారు. రైలులో ఉచితంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పోరు అని ఒకరు, క్లినిక్ ప్లస్ న్యూ యాడ్ అని మరికొంందరు అంటూ కామెంట్స్ చేశారు. గతంలో కూడా ముంబై రైళ్లలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షం సాక్షిగా... వీడియో కాన్ఫరెన్స్‌లో వివాహం...