Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుళ్ళకు కులాలను ఆపాదిస్తారా.. మీరు మనుషులేనా? పరిపూర్ణానంద(వీడియో)

మఠాధిపతులు, పీఠాధిపతుల్లో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు. గత కొన్నిరోజులకు ముందు దేవుళ్ళు ఏ కులం వారు అంటూ ఒక్కొక్క దేవుడి గురించి వారి కులం గురించి కొంతమంది వ్యాఖ్యానిస్తే

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (20:05 IST)
మఠాధిపతులు, పీఠాధిపతుల్లో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు. గత కొన్నిరోజులకు ముందు దేవుళ్ళు ఏ కులం వారు అంటూ ఒక్కొక్క దేవుడి గురించి వారి కులం గురించి కొంతమంది వ్యాఖ్యానిస్తే ఆ విషయంపై తీవ్రంగా స్పందించారు. దేవుళ్ళకు కులాలను ఆపాదించడం చాలా తప్పు. అసలలా మాట్లాడిన వారు మనుషులేనా అంటూ ప్రశ్నించారు. 
 
అంతే కాదు దళితులను రాక్షసులుగా వర్ణిస్తూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఖండించారు. సన్యాసులకే కులం లేనప్పుడు..దేవతలకు కులం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. టిటిడిలో నోటీసులు అందుకున్న 44మంది అన్యమత ఉద్యోగస్తులకు అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం ధర్మ ప్రచార విధానాన్ని పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్లే గ్రామాల్లో మతమార్పిడులు జరుగుతున్నాయని చెప్పారు. 
 
మతమార్పిడులను అరికట్టడానికి శ్రీ పీఠం ఆధ్వర్యంలో గ్రామగ్రామంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎపిలోని 14,276గ్రామాల్లో సంధ్యా గురుకులాలను విస్తరిస్తామని,  శ్రీ పీఠం తరపున మండస్థాయిలో గోశాలల ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో ఇస్లామిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని, ఇదే  విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని పరిపూర్ణానందస్వామి చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments