Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లిస్తానని ఇంటికి పిలిచి మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో ఓ దారుణం జరిగింది. అప్పు చెల్లిస్తానని నమ్మబలికి మహిళను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఓ కానిస్టేబుల్. ఈ కామాంధుడైన కానిస్టేబుల్‌కు మరో ఇద్దరు మిత్రులు కూడా తనవంతు సహకారం అందించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు దిబ్బల రోడ్డుకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె వద్ద కానిస్టేబుల్ రూ.35 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. 
 
అదేక్రమంలో ఆమెతో సన్నిహితంగా మెలుగుతూనే, ఆమెకు తెలియకుండానే నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. డబ్బులు చెల్లించమని కోరితే ఆ చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 8న అప్పు చెల్లిస్తానని తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి నల్లూరి సుధాకర్‌ ఇంటికి మహిళను పిలిచాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేశ్‌ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని వెళ్లగా సుధాకర్‌, వీరి స్నేహితుడు దొంగా హరి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments