Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ స్టేటస్‌లో 15 రోజుల ముందే అలా చేసింది..?

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (12:14 IST)
వాట్సాప్‌లో 15 రోజుల ముందే ఓ యువతి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదో సరదాకు అనుకుని స్నేహితులు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పలే చివరకి ఆ యువతి అన్నంత పనీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో వార్డ్ వాలంటీర్ పనిచేస్తున్న ఉమ్మనేని భువనేశ్వరి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 
 
పెట్రోల్ పోసుకొని పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమెది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఐతే ఆమె ఆత్మహత్య చేసుకున్న తీరు మాత్రం పోలీసులనే షాక్‌కు గురిచేసింది.
 
భువనేశ్వరి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తుండేది. ఈ క్రమంలో ఈనెల 18న సాయంత్రం గుంటూరు, విశాఖ, శ్రీకాకుళంకు చెందిన యువకులతో చాటింగ్ చేసింది. తాను చనిపోతున్నానంటూ గ్రూప్‌‌లో మెసేజ్ పెట్టింది. అంతకుముందు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే యువకుడికి ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ మెసేజ్ చేసింది. 
 
ఇక చనిపోవడానికి 15 రోజుల క్రితమే తన జీవితంలో ఇవే చివరి 15 రోజులంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఆ తర్వాత 14 రోజులు, 13 రోజులు, 12 రోజులు అంటూ స్టేటస్ అప్ డేట్ చేస్తూ వచ్చింది. వీటిని ఆమె ఫ్రెండ్స్ చూసినా కానీ పట్టించుకోలేదు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. భువనేశ్వరి వాట్సాప్ స్టేటస్ చూసిన వారిలో ఒక్కరు స్పందించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఆమె బ్రతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments