Webdunia - Bharat's app for daily news and videos

Install App

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (21:57 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత రోజా అధికార సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే వైద్య కళాశాలల స్థాపనను నిలిపివేసిందని, రైతు భరోసా కేంద్రాలను మూసివేస్తోందని, ఇప్పుడు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆమె ఆరోపించారు.
 
పాఠశాలలు మూసేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "విద్య ప్రభుత్వ బాధ్యత కాదని మీరు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి, ఇది మీ తప్పు కాదు, నిజమైన నింద ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు)పై ఉంది" అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒకే పాఠశాల ఉండాలనుకోవడం ఏ విధమైన విధానం అంటూ నిలదీశారు.గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టుకోవచ్చు.కానీ పిల్లలకు చదువు చెప్పే పాఠశాల మాత్రం ఒకటే ఉండాలంటారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments