Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కవిత కేసులో అనూహ్య పరిణామం : డీఫాల్ట్ పిటిషన్ వెనక్కి!

k kavitha

వరుణ్

, మంగళవారం, 6 ఆగస్టు 2024 (19:00 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఆమె తరపు న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. తుది విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 
 
అయితే, ఈ డిఫాల్ట్ పిటిషన్‌ ఉపంహరించుకుంటున్నట్లు కవిత తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని పేర్కొంటూ, జులై 6వ తేదీన కవిత డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు జులై 22న ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈ నెల 9న దీనిపై విచారణ జరపనుంది. 


తలలో పాకుతున్న పేలు... విమానం అత్యవసర ల్యాండింగ్!! 
 
సాధారణంగా ఏదేని సాంకేతిక సమస్య ఉత్పన్నమైతేనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. లేదా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ లేదా అత్యవసర వైద్య సాయం అందితేనే సాయం చేస్తారు. కానీ, ఇక్కడ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని గమనించిన మరో మహిళ.. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. ఈ సంఘటన వినడానికి కాస్త వింతగా, నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ నిజంగా ఈ సంఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న అమెరికా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఫినిక్స్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
'విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది చెప్పడంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. నేను చుట్టూ చూశాను. ఎవరూ భయపడడం లేదు. అయినా విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందు వైపునకు దూసుకుపోయింది' అని పేర్కొన్నాడు.
 
ఆ తర్వాత విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగితే అసలు విషయం తెలిసిందని, ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పారని పేర్కొన్నారు. వారొచ్చి చూస్తే నిజంగానే ఆమె తలలో పేలు పాకుతున్నాయని వివరించాడు. ఆ తర్వాత విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని చెప్పుకొచ్చాడు. 
 
ఈ ఘటన కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైందని, అప్పటివరకు ప్రయాణికులకు హోటల్లో గదులు ఇచ్చారని వివరించాడు. ఈ విషయాన్ని అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా ధ్రువీకరించింది. జూన్ 15న ఈ ఘటన జరిగిందని, ప్రయాణికురాలికి వైద్యసాయం అవసరం కావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోమారు ఆస్పత్రిలో చేరిన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీ!