Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతే... క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కారు (video)

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (17:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగనుంది. ఈ మేరకు శాసనమండలిలో ఏపీ పురపాలక శాఖామంత్రి క్లారిటీ ఇచ్చారు. తద్వారా రాజధాని అమరావతి మారుస్తారంటూ ఇంతకాలం సాగిన ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడినట్టు అయింది. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఎమ్మెల్సీలు శ్రీమతి పమిడి శమంతకమణి, గునపాటి దీపక్ కుమార్, పర్చూరి అశోక్ బాబు.. రాజధాని తరలింపు అంశంపై మండలిలో పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదంటూ ఆయన లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.
 
మరోవైపు, జగన్ సర్కార్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాజధానికి అమరావతి సరైన ప్రాంతం కాదని.. నిపుణుల కమీటీ రాష్ట్రమంతా పర్యటించి.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో అన్న దానిపై సమగ్రమైన నివేదిక ఇస్తుందన్న చెప్పిన సంగతి తెలిసిందే.
 
ఈ క్రమంలోనే నిపుణుల కమిటీ సర్వే కూడా పూర్తయింది. ఇక కొద్దిరోజుల్లో వైసీపీ ప్రభుత్వం రాజధాని అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తుందన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో లిఖితపూర్వకంగా రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments