పీఆర్సీ జీవో రద్దు చేసేవరకు చర్చల్లేవ్ : ఏపీ ఉద్యోగుల పీఆర్సీ సాధన సమితి

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (14:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలు రద్దు చేసేంతవరకు మంత్రులత కమిటీతో చర్చలకు వెళ్లే ప్రసకతే లేదని నాలుగు ప్రధాన ఉద్యోగసంఘాలకు పీఆర్సీ సాధన సమితి నేతలు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులక కమిటీ చట్టబద్ధత ఏంటో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
ఏపీ ప్రభుత్వం జారీచేసిన కొత్త పీఆర్సీ వల్ల వేతనాలు తగ్గుతున్నాయని, అందువల్ల తమకు పాత వేతనాలే ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనబాటపట్టారు. తమకు పాత జీతాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు దశల వారీగా వివిధ రకాలైన ఆందోళనలు చేపట్టి ఏడో తేదీ నుంచి సమ్మెను ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే ఫిబ్రవరి 6వ తేదీ అర్థరాత్రి నుంచి ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగాల సంఘాలన్నీ సమ్మెకు వెళ్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్లకూడదని ప్రభుత్వ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. పీఆర్సీ జీవోలను రద్దుతో పాటు అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, అలాగే, పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని వీటికి సమ్మతిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, పీఆర్సీపై ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు సాధన సమితి నేతలైన బండి శ్రీనివాస్, బొప్పరాజు, సూర్యనారాయణ, వెంకట్రామి రెడ్డిలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments