Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ ఆదేశాలు బేఖాతర్ : సుప్రీంలో తేలిన తర్వాత తుదినిర్ణయం!!

Webdunia
గురువారం, 23 జులై 2020 (16:13 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తిరిగి బాధ్యతల స్వీకారంపై దాగుడు మూతలు, అనిశ్చితి కొనసాగుతున్నాయి. 'నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తగిన చర్యలు తీసుకోండి' అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో.. నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్‌ స్పష్టంచేశారనే అభిప్రాయం కలిగింది. కానీ, ప్రభుత్వం మాత్రం దాగుడు మూతలు ఆడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. 
 
హైకోర్టు సూచన మేరకు గవర్నర్‌ను కలిసేందుకు వీలుగా ఈనెల 17వ తేదీనే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. అయితే... గవర్నర్‌ ఆయనకు 20వ తేదీన సమయం ఇచ్చారు. ఈలోపు... రాష్ట్రప్రభుత్వం చకచకా అడుగులు వేసింది. 
 
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం (24న) విచారణ జరపనున్నట్లు సమాచారం. ఈలోగా ప్రభుత్వం ఆయన్ను నియమించకపోవచ్చని.. సుప్రీంకోర్టు స్పందించే తీరును బట్టి నిర్ణయం తీసుకోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments