Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి దర్శనం లేదు, కానీ ఇ-హుండీకి భక్తులు కోటీ 97 లక్షలు - video

Webdunia
బుధవారం, 20 మే 2020 (23:02 IST)
తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో భక్తిభావంతో తినే స్వామివారి ప్రసాదం రేటును టిటిడి తగ్గించింది. చిన్న లడ్డూను ఇప్పటివరకు ఒక్కొక్కటి 50 రూపాయలకు విక్రయించేవారు. కానీ ఆ ధరను 25 రూపాయలకు తగ్గిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భక్తులకు కావాల్సినన్ని లడ్డూలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
 
ఎల్లుండి నుంచి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే 3 నుంచి 4 లక్షల లడ్డూలను ప్రతిరోజు తయారుచేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు లడ్డూలను అందిస్తున్నట్లు.. అది కూడా తక్కువ రేటుకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు.
 
ముఖ్యంగా ఈ-హుండీ ద్వారా ఎవరైతే స్వామివారికి మ్రొక్కుల రూపంలో నగదును చెల్లిస్తారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అవసరాన్ని బట్టి భక్తులకు 5 వేల లడ్డూల వరకు అందజేస్తామన్నారు. శ్రీవారి దర్సనం తిరిగి ప్రారంభమయ్యేంతవరకు భక్తులకు లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీవారి భక్తులకు దర్సనం కల్పించకపోయినా ఈ-హుండీ ద్వారా కోటి 97 లక్షల రూపాయల ఆదాయం ఈ యేడాది వచ్చినట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. 
 
శ్రీవారి దర్సనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమని.. టిటిడి కాంట్రాక్ట్ కార్మికులకు నెల నెలా సరైన రీతిలో జీతాలను అందజేస్తున్నట్లు చెప్పారు. జీతాలు ఇవ్వలేనంత దీనస్థితిలో టిటిడి లేదని టిటిడి ఛైర్మన్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments