కరోనా నుంచి చెన్నై కోలుకునేనా? ఒక్క రోజే 743 పాజటివ్ కేసులు

Webdunia
బుధవారం, 20 మే 2020 (22:07 IST)
కరోనా వైరస్ నుంచి చెన్నై మహానగరం ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా ఒక్క చెన్నై నగరంలోనే కరోనా కేసుల సంఖ్య వేలకు వేలు పెరిగిపోతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 743 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని ఒక్క చెన్నైలోనే మొత్తం కరోనా కేసుల సంఖ్య 8228కు చేరుకున్నాయి. అలాగే, 59 మంది చనిపోగా, 2823 మంది రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 13191కు చేరింది. కరోనా వల్ల ఇప్పటివరకూ 87 మంది మరణించారు. తమిళనాడులో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,219. మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో బుధవారం 83 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే సుమారుగా 60 శాతం కేసులు నమోదుకావడం ఇపుడు ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు, కొత్త పాజిటివ్ కేసులో ప్రతి రోజూ వందల సంఖ్యలో నమోదవుతుంటే.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ ఆంక్షలను గణనీయంగా సడలించింది. ఇప్పటికే మద్యం షాపులు తెరిచింది. అలాగే, సిటీ బస్సులను కూడా నడుపుతోంది. త్వరలోనే ప్రైవేటు బస్సులను కూడా నడిపేందుకు సిద్ధమవుతోంది. పైగా, చెన్నైలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కోయంబేడు మార్కెట్‌ను తిరిగి తెరిచేందుకు సీఎండీఎం (చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల కరోనా కాంటాక్ట్ కేసులు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments