Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ లేదని నర్సు డెలీవరీ చేసింది.. అంతే పసికందు ప్రాణాలు?

Webdunia
శనివారం, 11 మే 2019 (10:49 IST)
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యమైన సంఘటనను మరువక ముందే మరో శిశువు ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి శిశువుకు పచ్చకామెర్లు వచ్చాయని తల్లిదండ్రులు తీసుకెళ్తే.. శిశువు అదృశ్యమైన ఘటన గురించి తెలిసిందే.


ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు చిన్నారిని మోసిన ఆ తల్లికి ఆసుపత్రి సిబ్బంది కడుపుకోతను మిగిల్చారు. డాక్టర్ లేకపోవడంతో నార్మల్ డెలివరీ చేయించబోయారు. అయితే ఈ వైద్యం వికటించి పిల్లాడు పురిట్లోనే మృతి చెందిన ఘటన తెలంగాణలోని నిజామాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రేణుక అనే మహిళ మూడో కాన్పు కోసం చేరింది. నొప్పులు రావడంతో డాక్టర్‌ని పిలిచారు. కానీ డాక్టర్ అంబికా రెండ్రోజులుగా అందుబాటులో లేకపోవడంతో నర్సు జ్యోతి తాను డెలివరీ చేయిస్తానని చెప్పింది. అనంతరం నార్మల్ డెలివరీ పూర్తయ్యాక కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని జ్యోతి దాచిపెట్టింది. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనీ, పక్కనే ఉన్న మెట్ పల్లిలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించింది.
 
బాబును మెట్ పల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే బాలుడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. డెలివరీ సందర్భంగా జరిగిన పొరపాటు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments