హమ్మయ్య... ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్‌కు స్వగ్రామంలో ఓటు

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (10:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఎట్టకేలకు తన స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు లభించింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయన పేరును ఓటర్ల జాబితాలో చేర్చారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానికంగా ఉండట్లేదంటూ స్థానిక ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించిన విషయం తెల్సిందే. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో ఆయన స్వగ్రామంలోనే తనకు ఓటు హక్కును ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దుగ్గిరాలలోనే ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి లక్ష్మి కూడా అదే గ్రామంలో ఉంటున్నారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కోర్టుకు ఆయనకు అర్హతలుంటే అదే గ్రామంలో ఓటు హక్కు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరు జాబితాలో చేరింది. 
 
జీవితంలో రాత్రులన్నీ వృథా అయిపోతున్నాయి... ఎన్నికల శిక్షణకు రాలేనన్న ఉపాధ్యాయుడు ... ఎక్కడ?  
 
ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లి కాలేదని, అందువల్ల తాను ఎన్నికల శిక్షణకు రాలేనని ఓ ఉపాధ్యాయుడు తెగేసి చెప్పాడు. దీంతో అతనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివారలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో అఖిలేశ్ కుమార్ అనే సంస్కృత ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయనకు వయసు 35 యేళ్లు. అయితే, కొన్నేళ్లుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం కాలేదు. దీంతో ఆయన విరక్తి చెందాడు. ఇదిలావుంటే, మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల విధుల కోసం కొందరు ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు హాజరుకాలేనని తెగేసి చెప్పాడు. 
 
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబరు 16, 17 తేదీల్లో ఎన్నికల విధులపై శిక్షణకు హాజరుకావాలని అధికారులు ఈయనను కోరారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా అఖిలేశ్ శిక్షణకు గైర్హాజరయ్యారు. దీనిపై అధికారులు షోకాజ్ నోటీసు పంపగా. 'నా జీవితంలో రాత్రులన్నీ వృథా అవుతున్నాయి. ఇప్పటికే 35 ఏళ్లు నిండాయి. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమోనని భయమేస్తోంది. ముందు నన్ను పెళ్లి చేసుకోనివ్వండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తా' అని అక్టోబరు 31న అఖిలేశ్ బదులు ఇచ్చారు. 
 
రూ.3.5 లక్షల కట్నం, తను ఉంటున్న ప్రాంతంలో ఓ ఫ్లాటు కూడా కావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడి వైఖరికి విస్తుపోయిన జిల్లా కలెక్టరు నవంబరు 2న అఖిలేశ్‌కు సస్పెన్షను ఉత్తర్వులు పంపారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని, పెళ్లి కాలేదనే ఒత్తిడిలో ఉన్నట్లు తోటి ఉద్యోగి ఒకరు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments