Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీసం తిప్పిన ఆ అనంత పోలీస్... అర్థరాత్రి సెల్యూట్ కొట్టారు... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (21:11 IST)
ఒక్కోసారి సాధారణంగా మనం పనిచేసే వృత్తిని వదిలి వేరే వృత్తిని ఎంచుకుంటుంటాం. మనకు బాగా ఇష్టమైన వృత్తి అయితే అందులోనే ఉండిపోతాం. మనకు పేరు తెచ్చిపెట్టి, ఒక స్టేజ్‌కు తీసుకెళితే ఇక చెప్పలేము. ప్రతి ఒక్కరిలో అహం అనేది ఉంటుంది. కొందరు అది ఉన్నా వాటిని పక్కనబెట్టి సాదాసీదా వ్యక్తులలా ఉండిపోతారు.
 
అలాంటి వ్యక్తుల్లో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ పోలీసు అధికారి, ప్రస్తుత ఎంపి గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. అప్పట్లో పోలీసులను తీవ్రస్థాయిలో దూషించిన టిడిపి ఎంపి జె.సి.దివాకర్ రెడ్డిపైనే విమర్శలు చేసి మీసం తిప్పి తొడకొట్టారు గోరంట్ల మాధవ్. అంతేకాదు రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుని ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. ఆ పార్టీలో చేరి అనంతపురం జిల్లాలో ఎంపి సీటును సంపాదించుకుని పోటీ చేశారు.
 
పోటీ చేయడమే కాదు ప్రత్యర్థిపై భారీ మెజారిటీని సాధించారు. అర్థరాత్రి వరకు ఈ ఎన్నికలు జరిగితే చివరకు ఫలితాలు ఉదయానికి వచ్చాయి. గోరంట్ల మాధవ్ గెలిచాడని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో పోలింగ్ బూత్ లో పనిచేస్తున్న పోలీసులు గోరంట్ల మాధవ్ కు సెల్యూట్ చేశారు. అయితే తాను ఎంపి అయ్యాయన్న విషయాన్ని పక్కనబెట్టి సెల్యూట్ చేసిన వారికందరికీ ప్రతిగా సెల్యూట్ చేశారు గోరంట్ల మాధవ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments