Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎవడు' టైప్‌లో ప్రియురాలు మాస్టర్ ప్లాన్... మటన్ సూప్‌ పట్టిచ్చింది...

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌న

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:49 IST)
నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న  సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజేష్‌తో సెటిలైపోయేందుకు స్వాతి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ స్వాతి ప్లాన్‌ను సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు బట్టబయలు చేశారు. 
 
ఎలాగంటే..? యాసిడ్ దాడి జరిగిన తమ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కోడలికి ధైర్యం చెప్పేందుకు.. ఆస్పత్రిలో సుధాకర్‌ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు వచ్చారు. తమ కుమారుడేనని భావిస్తున్న వారికి తొలి అనుమానం మటన్ సూప్ వద్ద వచ్చింది. చికిత్స పొందుతున్న వ్యక్తి రాజేష్ అని సుధాకర్ కాదనే అనుమానం ఆయన తల్లిదండ్రులకు ఎలా వచ్చిందంటే... సాధారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉంటే, వారికి బలవర్ధక ఆహారంగా మటన్ సూప్‌ను ఇస్తారు. ఇదే తరహాలో రాజేష్‌కు ఆస్పత్రి వర్గాలు మటన్ సూప్ ఇచ్చారు. 
 
కానీ దాన్ని రాజేష్ నిరాకరించాడు. సుధాకర్ మాంసాహారి కావడం.. అతనికి మటన్ సూప్ అంటే తెగ ఇష్టం. కానీ రాజేష్ మటన్ సూప్ వద్దనడం.. దాన్ని ముట్టుకోకపోవడంతో అతనిపై వారికి అనుమానం వచ్చింది. ఈ అనుమానంతోనే ఈ కేసు తమ వరకు వచ్చిందని.. సుధాకర్ తల్లిదండ్రులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతోనే స్వాతి బండారాన్ని బట్టబయలు చేయగలిగామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments