Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రమకు దక్కిన ఫలితం : సుధాకర్‌ గౌడ్‌

భీమగాని సుధాకర్‌ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం 'ఆదిత్య'. 'క్రియేటివ్‌ జీనియస్‌' ఉపశీర్షిక. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల

Advertiesment
Aditya Creative Genius
, గురువారం, 16 నవంబరు 2017 (08:56 IST)
భీమగాని సుధాకర్‌ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం 'ఆదిత్య'. 'క్రియేటివ్‌ జీనియస్‌' ఉపశీర్షిక. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు సుధాకర్‌ గౌడ్‌. ఈ చిత్రం ద్వారా బాల బాలికల్లో కులం మతం అనే బేధాలు ఉండకూడదని, కేవలం ప్రతిభ ఆధారంగానే పిల్లలు ఎదిగేలా చూడాలని దర్శకులు సందేశమిచ్చారు. 
 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వంటి శాస్త్రవేత్తలు మన చుట్టూ ఉండే పిల్లల్లోలనూ ఉండొచ్చని, వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. భావి భారత పౌరులైన చిన్నారులు చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల వాతావరణ, మూగ జీవాలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో చూపించారు. ఇలా బాల బాలికల్లో స్ఫూర్తినింపే అనేక అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకులు తెరకెక్కించారు. 
 
నవంబర్‌ 4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ మధ్యాహ్నం ఆటతో పలు కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఇండీవుడ్‌ చిత్రోత్సవంలో అవార్డ్‌నూ అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది. 
 
వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా పేరు తెచ్చుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి నంది గౌరవం దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, జ్యూరీ సభ్యులు తన శ్రమను గుర్తించారని దర్శక నిర్మాత భీమగాని సుధాకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని బాలల చిత్రాలు తెరకెక్కించి అలరించాలని కోరుకుంటున్నానని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సందేశమున్న చిత్రం కావడం వల్లే అవార్డులు : ఎన్టీఆర్