Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.22కే పెట్రోల్ - ఎప్పటి నుంచో తెలుసా?

పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడే సామాన్య ప్రజలకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. పెట్రోల్ ధరలను అతి త్వరలో తగ్గించపోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌లు కలపడం ద్వారా పెట్రోల్ రేటును తగ్గించవచ్చని చెప్పారు గడ్కరీ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (19:20 IST)
పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడే సామాన్య ప్రజలకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. పెట్రోల్ ధరలను అతి త్వరలో తగ్గించపోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌లు కలపడం ద్వారా పెట్రోల్ రేటును తగ్గించవచ్చని చెప్పారు గడ్కరీ. కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చునన్నారు. దీనిపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రకటన కూడా చేస్తానని చెప్పారు నితిన్ గడ్కరి.
 
లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపుగా 80 రూపాయలు ఉంటుండగా బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనల్ మాత్రం 22 రూపాయలకే లభిస్తోందని, చైనాలో అయితే ఈ ధర 17 రూపాయలు మాత్రమేనని చెప్పారు కేంద్రమంత్రి. ప్రయోగాత్మకంగా స్వీడన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కొన్ని బస్సులను తయారుచేసిందట. 
 
త్వరలోనే ఆ 25 బస్సులను నగరంలో తిప్పనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ మిథనాల్‌ను ముంబైలోని స్థానిక పరిశ్రమ నుంచే తయారుచేయవచ్చని వాటి నుంచి వచ్చే ఇంధనంతో బస్సులకు వాడుతామని చెప్పారు. పెట్రోల్ శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు 70 వేల కోట్లు ఖర్చవుతూ ఉండగా మిథనాల్ అయితే లక్షన్నర కోట్లు అవుతున్నట్లు చెప్పారు. అయితే మిథనాల్ కంపెనీలపైనే ఎక్కువ దృష్టి సారించాలని చెప్పినట్లు కేంద్రమంత్రి చెప్పారు. దీంతో మిథనాల్ పెట్రోల్ బంక్ లకు చేరితే వాటి ధర తక్కువగా ఉంటుంది. ఈ మిథనాల్ ను ఇప్పుడున్న వాహనాలకు కూడా వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments