Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమలు

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:44 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి చెప్పుకొచ్చారు.

శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం వలన అనేక కుటుంబాలు చిన్నా భిన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం 450 షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో 3500 షాపులను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వీటిని నిర్వహించడానికి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలను చేసినట్లు మంత్రి తెలిపారు. 
 
త్వరలోనే సమయం కుదింపు :
‘ఎక్కడా అవినీతి జరగకుండా ఎక్సైస్ శాఖ అధికారులు వీటిని పర్యవేక్షిస్తారు. 678 కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ప్రపోజల్ పంపాము. మహిళలు, ప్రతిపక్షం వారు కూడా మద్య విధానానికి, దశలవారీ మద్య నిషేధానికి సహకరిచాలి. బెల్టు షాపులు నిర్వహించే వారికి వేరే ఉపాధి కోసం కలెక్టర్లతో మాట్లాడాము.

ధరల విషయంలో త్వరలో ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తాము. బార్ షాపుల సమయంపై కూడా చర్చిస్తున్నాము. త్వరలోనే కచ్చితంగా సమయం కుదింపు ఉంటుంది. బెల్టు షాపులు పెట్టకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము.

మహిళలు ఖచ్చితంగా వచ్చి మాకు మద్యం దుకాణం వద్దంటే అక్కడ వాస్తవ పరిస్తితులకు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము’ అని మంత్రి తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments