ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ... విడుదల చేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (08:58 IST)
రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం కొత్త  ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇకపై మద్యం షాపులను నిర్వహించనుంది. ఈ ఏడాదికి 3 వేల 500 దుకాణాలను ప్రభుత్వం  నిర్వహించనుంది. మండలాలు, మున్సిపాల్టీలు,కార్పొరేషన్ల లో షాపుల ప్రదేశాలను  బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ గుర్తించనున్నారు.

150 నుంచి 300 చ.అడుగుల విస్తీర్ణంలో ఒక్కో మద్యం షాపు నిర్వహించనున్నారు. ప్రతి షాపుకు తెలుగు,ఇంగ్లీషుల్లో నెంబర్ బోర్డులు బేవరేజెస్ కార్పొరేషన్ వేయించనుంది. ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో షాపునకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమించనున్నారు. డిగ్రీ అర్హతతో సూపర్ వైజర్ కు 17 వేల 500 జీతం, ఇంటర్ అర్హతతో సేల్స్ మెన్ లకు 15 వేల జీతంతో నియమించనున్నారు.

పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ షాపులను నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రంలో త్రిష కృష్ణన్?

మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించిన తమన్నా భాటియా

Dimple Hayathi : భోగి లో తిరుగుబాటు స్వభావం లుక్ తో మందారం గా డింపుల్ హయాతి

Peddi diet: రామ్ చరణ్ శాఖాహారం, కఠిన వ్యాయామంతో రూపొందిన పెద్ది ట్రైలర్ రాబోతోంది

Suriya: త్రిషతో 23 ఏళ్ల తర్వాత డిఫరెంట్ కథతో వీరభద్రుడు చేశా : కథానాయకుడు సూర్య

తర్వాతి కథనం
Show comments