Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారిగా పడిపోయిన టమోటా ధర... కేజీ రూ.10 మాత్రమే...

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (08:23 IST)
గత కొన్ని రోజులుగా టమోటా ధర ఠారెత్తించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టమోటా ధర డబుల్, ట్రిబుల్ సెంచరీ కొట్టింది. దీంతో ప్రభుత్వాలు సైతం బెంబేలెత్తిపోయాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం టమోటా ధర చూసి నోరెళ్లబెట్టారు. ఈ ధరల పెరుగుదల పుణ్యమాని అనేకమంది టమోటా రైతులు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. ఇదంతా నిన్నటి మొన్నటి పరిస్థితి. ఇపుడు టమోటా ధర ఒక్కసారిగా పడిపోయింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమోటా కొనుగోళ్లు శుక్రవారం పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. రైతులు తొలిరోజే సుమారు 10 టన్నుల సరకు మార్కెట్‌కు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. అంటే.. కిలోకు రూ.10 కూడా దక్కలేదని రైతులు వాపోయారు. 
 
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు.. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు మాత్రం కిలో టమాటాకు రూ.30-40 వరకు వెచ్చించక తప్పడం లేదు. ప్రధాన మార్కెట్‌లో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు లేని ధరకు అమ్ముతుంటే చిల్లర వ్యాపారులు మాత్రం ఇష్టానుసారమైన ధరకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments