మాయావతికి పాదాభివందనం చేసిన పవన్ కల్యాణ్..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (19:04 IST)
ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాదాభివందనం చేసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్న మాయావతికి పవన్ సాదరంగా ఆహ్వానం పలికారు. 
 
వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి మాయావతి కాన్వాయ్ బయటికి వస్తున్న సమయంలో ఆమెను కలిసిన పవన్ కల్యాణ్ రెండు చేతులు జోడించి ఆమెకు నమస్కారం చేసారు. ఆ తర్వాత వంగి ఆమె పాదాలకు వందనం చేసారు. ఆ వెంటనే మాయావతి బస చేసేందుకు నేరుగా హోటల్‌కు వెళ్లిపోయారు. ఆమె వెంట వచ్చిన వారిని కూడా పవన్ ఆప్యాయంగా పలకరించారు. 
 
కాగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీలో జనసేన, లెఫ్ట్ పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆమె ఇవాళ వైజాగ్ వచ్చారు. 3వ తేదీన ఉదయం వైజాగ్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొంటారు. 
 
మధ్యాహ్నం విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. 4వ తేదీన ఉదయం తిరుపతిలో జరిగే బహిరంగసభలో పాల్గొన్న తర్వాత సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో మాయావతి పవన్‌ కల్యాణ్‌తో కలిసి పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments