Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పాలెం సెంటరులో నిప్పంటించుకున్న సుబ్బులు...

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది. 
 
శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణానికి చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తాను కూడా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
 
ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) పూర్తిగా కాలిపోయి మృతిచెందారు. అయితే.. నిప్పు పెట్టుకోవడాన్ని చూసిన కుమారుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులకు ఈ విషయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
 
కాగా ఆ మహిళ ఇద్దరు పిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు బళ్లారి నుంచి వచ్చిన బస్సులో నెల్లూరు పాలెం సెంటర్లో దిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కుమారుడు మహేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments