Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక ఇబ్బందులు : ఆరేళ్ళ బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్

Advertiesment
ఆర్థిక ఇబ్బందులు : ఆరేళ్ళ బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ టీచర్
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:43 IST)
విశాఖపట్టణం జిల్లాలో తీవ్ర విషాదకరఘటన ఒకటి జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు.. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ప్రైవేట్ స్కూల్‌లో టీచరుగా పని చేసే ఓ మహిళ... తన ఆరేళ్ళ బిడ్డను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడిందని విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ఘటన మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరలాను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన సరిత కుటుంబం 2015లో విశాఖపట్నం వచ్చి స్థిరపడింది. మారిక వలస రాజీవ్ గృహ కల్ప కాలనీలో నివాసముంటున్న సరిత ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. 
 
ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు. భర్తకు హోటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతో మరో హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వ్యాపారానికి సంబంధించి నష్టాలు రావడం, ఇందుకు కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో భార్య, భర్తల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్ధలు వచ్చాయి.
 
ఇదే క్రమంలో మనస్తాపానికి గురైన సరిత తనువు చాలించాలని నిర్ణయించుకుంది. దీంతో తన ఆరేళ్ల కొడుకును చంపి.. తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. 
 
ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సరిత రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాల డెయిరీలో అక్రమాలు.. టీడీపీ నేత ధూళిపాళ్ళ అరెస్టు