Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. విద్యార్థిని గొంతుకోసిన యువకుడు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (11:55 IST)
ఏపీలోని ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెంకటగిరిలోని కాలేజీ మిట్ట వద్ద ఓ ప్రేమోన్మాది ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదన్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాకు చెందిన చెంచు కృష్ణ అనే యువకుడు గత కొన్ని రోజులుగా చిగురుపాటి జ్యోతిక(18)ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వెంటపడేవాడు. అయితే జ్యోతిక మాత్రం నిరాకరిస్తూ వస్తోంది.
 
కాగా తన ప్రేమను ఒప్పుకోవడం లేదన్న కారణంతో జ్యోతికపై కక్ష పెంచుకున్నాడు కృష్ణ. ఇవాళ ఫుల్లుగా మద్యం సేవించి విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతికను నెల్లూరు జిల్లా ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments