Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోల ప్రతీకారం : బస్సులకు నిప్పు... కానిస్టేబుల్ కాల్చివేత

ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు, మరో ప్రైవేట్‌ సర్వీసులకు మావోలు నిప్పంటించారు.

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (10:04 IST)
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు, మరో ప్రైవేట్‌ సర్వీసులకు మావోలు నిప్పంటించారు. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. సుకుమా జిల్లా దోర్నపాల్‌ కుత్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు అడ్డుకుని, ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు డీజిల్‌ ట్యాంక్‌ను పగులగొట్టి, ఆయిల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు. 
 
అలాగే, ప్రయాణికులు చూస్తుండగానే ఒకరిని కాల్చి చంపారు. మృతుడు కానిస్టేబుల్‌గా భావిస్తున్నారు. ఇదే దారి నుంచి వెళ్తున్న మరో ప్రైవేటు బస్సు, ఒక ట్రాక్టర్‌ను కూడా దహనం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ, ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు చేరుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments