Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పకోడీల వ్యాపారానికి లోను ఇప్పించండి.. స్మృతి ఇరానీకి బీజేపీ కార్యకర్త లేఖ

పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉపాధేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ముహుర్తాన వ్యాఖ్యానించారో గానీ.. ఈ వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా, బీజేపీ కార్యకర్తలపై ఈ వ్యాఖ్యలపై తమదై

పకోడీల వ్యాపారానికి లోను ఇప్పించండి.. స్మృతి ఇరానీకి బీజేపీ కార్యకర్త లేఖ
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (18:30 IST)
పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉపాధేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ముహుర్తాన వ్యాఖ్యానించారో గానీ.. ఈ వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా, బీజేపీ కార్యకర్తలపై ఈ వ్యాఖ్యలపై తమదైనశైలిలో వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఓ కార్యకర్త కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ లేఖ రాశారు. పకోడీలు తయారు చేసి, అమ్ముకునే వ్యాపారం స్టార్ట్ చేసేందుకు బ్యాంకు రుణం ఇప్పంచాలని ఆ లేఖలో కోరారు. ఇది బీజేపీ నేతలను మరింతగా ఇరుకున పెట్టేసింది. ఈ లేఖలోని సారాంశాన్ని పరిశీలిస్తే, 
 
'గౌరవనీయులైన కేంద్రమంత్రివర్యులు స్మృతి ఇరానీ గారికి... బీజేపీకి ఉన్న కార్యర్తల్లో తాను ఒకడిని. అమేథీ నియోజకవర్గం సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా పని చేస్తున్నాను. అయితే గత కొన్ని రోజులుగా జాబ్ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. అయినాసరే ఉపాధి లభించలేదు. ఏం చేద్దామా అనుకుంటున్న తరుణంలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. పకోడీలు అమ్ముకోవడం గురించి చెప్పారు. వెంటనే నాకు ఓ ఆలోచన తట్టి ఉద్యోగ అన్వేషణ ప్రయాత్నాలు మానేశాను.
 
చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికి ముద్రా లోన్ కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. ఎవరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ల మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. లోన్ అడిగితే ఏవేవో చెబుతున్నారు. వాళ్ల మాటలు చూస్తుంటే.. లోన్ మంజూరుకావడం ఇప్పట్లో సాధ్యం కాదనిపిస్తోంది. 
 
మరోవైపు ముద్రా లోన్ల ద్వారా 10 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందని.. సాక్షాత్తు ప్రధాని మోడీ చెబుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గం కూడా ఇదే చెబుతూ వస్తోంది. ప్రధాని స్థాయి వ్యక్తి అబద్ధాలు చెబుతారు అనుకోవడం లేదు. ఆయనపై నాకు నమ్మకం, గౌరవం ఉంది. అయినా బ్యాంకుల వైఖరి మాత్రం.. ప్రధాని ఆశయాలకు విరుద్ధంగా ఉందని మాత్రం చెప్పగలను. ఈ విషయంలో నాకు మీరే ఏవిధంగానైనా సాయమందించగలరని నా నమ్మకం. ప్రధాని మోడీతో మాట్లాడి.. పకోడీల వ్యాపారం ప్రారంభించడానికి నాకు లోన్ ఇప్పించండి అంటూ అమేథీ నియోజకవర్గ బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అశ్విన్ మిత్రా అనే బీజేపీ కార్యకర్త రాసిన లేఖలో పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్ఆర్ఎంలో మెటీరియల్ కెమిస్ట్రీపై అంతర్జాతీయ సదస్సు