Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#GujaratVerdict : స్మృతి ఇరానీకి ప్రధాని మోడీ గిఫ్ట్

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరస్మరణీయమైన బహుమతిని ఇవ్వనున్నారట. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది.

Advertiesment
Smriti Irani
, మంగళవారం, 19 డిశెంబరు 2017 (08:31 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరస్మరణీయమైన బహుమతిని ఇవ్వనున్నారట. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. సోమవారం వెల్లడైన ఓట్ల ఫలితాల్లో బీజేపీకి 99 సీట్లలో గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో వరుసగా ఆరోసారి కూడా బీజేపీ సర్కారు ఏర్పాటుకానుంది. 
 
అయితే, ఈ గెలుపు మోడీకి సంతృప్తి కలిగించలేదట. అందుకే తనలాగా ప్రజాకర్షణ కలిగన నేతను గుజరాత్ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇందులోభాగంగా, ప్రస్తుత సీఎం విజయ్‌రూపానీ గెలిచినప్పటికీ ఆయన స్థానంలో ప్రజాకర్షక నేతనెవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలన్నది మోడీ ఆలోచనగా ఉందట. 
 
ఆ స్థాయి ప్రజాకర్షక నేతగా తన మంత్రివర్గంలో పని చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై మోడీ దృష్టి మళ్లింది. దీంతో సీఎం రేసులో ఆమె పేరు తెరపైకి వచ్చింది. మంచి నాయకత్వ లక్షణాలు, గుజరాతీలో బాగా మాట్లాడగలిగే నేర్పు ఉన్న స్మృతి సీఎం అయితే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
 
అలాగే, సీఎం రేసులో మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవ్య కూడా ఉన్నారట. ఈయన సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన పటీదార్‌. రైతు పక్షపాతిగా మంచి పేరున్న నేత. సీఎం రేసులో మూడోస్థానంలో ఉన్న వ్యక్తి.. వాజుభాయ్‌ వాలా. గతంలో గుజరాత్‌ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు. వీరందరి కంటే స్మృతి ఇరానీ వైపే ప్రధాని మోడీతో పాటు.. బీజేపీ చీఫ్ అమిత్ షాలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతి భర్తను చంపిన రాజేష్‌ను నేనే చంపేస్తా... తల్లి ఆగ్రహం