Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతి భర్తను చంపిన రాజేష్‌ను నేనే చంపేస్తా... తల్లి ఆగ్రహం

స్వాతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు రాజేష్‌. రాజేష్‌ సొంత జిల్లా మహబూబ్ నగర్. రాజేష్‌ ఒక ఫిజియో థెరపిస్ట్. స్వాతికి ఫిజియో థెరపీ చేసేందుకు సుధాకర్ రెడ్డి ఒకసారి రాజేష్‌ వద్దకు తీసుకెళ్ళగా అక్కడ వార

Advertiesment
స్వాతి భర్తను చంపిన రాజేష్‌ను నేనే చంపేస్తా... తల్లి ఆగ్రహం
, సోమవారం, 18 డిశెంబరు 2017 (20:39 IST)
స్వాతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేశాడు ప్రియుడు రాజేష్‌. రాజేష్‌ సొంత జిల్లా మహబూబ్ నగర్. రాజేష్‌ ఒక ఫిజియో థెరపిస్ట్. స్వాతికి ఫిజియో థెరపీ చేసేందుకు సుధాకర్ రెడ్డి ఒకసారి రాజేష్‌ వద్దకు తీసుకెళ్ళగా అక్కడ వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో తాను ఉండలేను.. తనను ఎక్కడికైనా తీసుకెళ్ళమని రాజేష్‌ పైన ఒత్తిడి తెచ్చింది స్వాతి. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న తతంగం కాస్త భర్త సుధాకర్ రెడ్డికి తెలిసింది. భార్యను మందలించాడు కూడా.
 
అయితే విషయం కాస్త భర్తకు తెలియడంతో రాజేష్‌, స్వాతి ఇద్దరు కలిసి అతి దారుణంగా సుధాకర్ రెడ్డిని చంపేశారు. ఇదంతా జరిగిన విషయమే. ఇప్పుడు తాజాగా రాజేష్‌ తల్లి కోమలమ్మ నా బిడ్డను నేను చంపేస్తా. ఒక హత్య చేసిన వ్యక్తి భూమి మీద బతికే అర్హత లేదు. అతన్ని చంపేయండి.. మీ వల్ల కాకుంటే నాకు అప్పజెప్పండి.. నేను చంపి జైలుకెళ్లి కూర్చుంటానంటోంది రాజేష్‌ తల్లి. 
 
ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆ కుటుంబంలోని పెద్ద దిక్కును చంపేస్తాడా అంటూ బోరున విలపించింది రాజేష్‌ తల్లి కోమలమ్మ. తనవరకూ తన బిడ్డ రాజేష్‌ చనిపోయి 20 రోజులవుతోంది. నాకు వాడు బిడ్డే కాదంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. మా కుటుంబం మొత్తాన్ని తలదించుకునేలా చేసిన రాజేష్‌‌ను వెంటనే చంపేయాలని వేడుకొంటోంది తల్లి కోమలమ్మ. మరోవైపు స్వాతి తల్లిదండ్రులు కూడా ఆమెకు మరణశిక్ష వేయాలని కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల వికాసం : గుజరాత్ - హిమాచల్‌‍లో బీజేపీదే గెలుపు