Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడుకు పుట్టినరోజు నాడే భర్తను చంపేసిన స్వాతి...

తన బిడ్డ పుట్టినరోజు నాడే కట్టుకున్న భర్తను కూడా స్వాతి చంపేసింది. నవంబరు 27న సుధాకర్‌ రెడ్డి కుమారుడు దర్శిత్‌ పుట్టిన రోజు. ఆ రోజు తెల్లవారుజామునే ప్రియుడితో కలిసి భర్తను స్వాతి అతి కిరాతకంగా హతమార్

Advertiesment
Sudhakar Reddy Murder Case
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (13:22 IST)
తన బిడ్డ పుట్టినరోజు నాడే కట్టుకున్న భర్తను కూడా స్వాతి చంపేసింది. నవంబరు 27న సుధాకర్‌ రెడ్డి కుమారుడు దర్శిత్‌ పుట్టిన రోజు. ఆ రోజు తెల్లవారుజామునే ప్రియుడితో కలిసి భర్తను స్వాతి అతి కిరాతకంగా హతమార్చింది. ఇపుడు ఇదే కేసులో తల్లి స్వాతి అరెస్టు కావడంతో పిల్లలు దర్శిత్‌ (7), హర్షిత(4)లు అనాథలయ్యారు. 
 
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డి, అదే మండలం గట్టునెల్లికుదురుకు చెందిన స్వాతిలు 2010 నవంబర్‌లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం సుధాకర్‌ రెడ్డి కొద్దికాలంపాటు హైదరాబాద్‌లోని గుబ్బ స్టోర్స్‌లో అకౌంటెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత గట్టురాయిపాకుల వద్ద ఓ క్రషర్‌ను లీజుకు తీసుకొని నాగర్‌కర్నూల్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన సుధాకర్‌ రెడ్డిపై యాసిడ్‌ దాడి జరిగిందని కూతురు ఫోన్‌ చేయడంతో స్వాతి తల్లిదండ్రులు లింగారెడ్డి, పద్మలు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లారు. కుమార్తె చెప్పి మాటలను వారు నమ్మారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది సుధాకర్‌ రెడ్డి కాదు రాజేష్‌ అనే విషయం ఈ నెల 7న నిర్ధారణ కావడంతో వారి గుండెల్లో పిడుగుపడినంత పనైంది. తమ బిడ్డ చేసిన పనికి వారు నిర్ఘాంతపోయారు. 
 
తమ ఇకలేడన్న నిజం తెలుసుకుని తండ్రి నర్సింహా రెడ్డి తల్లి సుమతమ్మ దిగ్భ్రాంతికి గురయ్యారు. బరువెక్కిన హృదయాలతో బండపల్లికి చేరుకొని శాస్త్రోక్తంగా ఖర్మకాండలు జరిపించారు. ఇదేసమయంలో బంగారంలాంటి అల్లుడిని పొట్టనపెట్టుకున్నదంటూ స్వాతి తల్లిదండ్రులు ఆమె బతికి ఉండగానే కర్మకాండలు జరిపించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తమ కూతురు బతికి ఉన్నా చచ్చిన శవంతో సమానమని స్వాతి తండ్రి లింగారెడ్డి గుండు గీయించుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతికి ఖర్మకాండలు.. సజీవదహనం చేయమంటున్న తల్లిదండ్రులు