Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడక గదిలో ప్రియుడితో రాసలీలలు.. కుమార్తె చూసిందనీ...

తెలంగాణా రాష్ట్రంలో తాజాగా మరో కిరాతక చర్య వెలుగులోకి వచ్చింది. పడక గదిలో తన ప్రియుడితో సాగిస్తున్న రాసలీలలను కన్నబిడ్డ చూసింది.

Advertiesment
పడక గదిలో ప్రియుడితో రాసలీలలు.. కుమార్తె చూసిందనీ...
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:23 IST)
తెలంగాణా రాష్ట్రంలో తాజాగా మరో కిరాతక చర్య వెలుగులోకి వచ్చింది. పడక గదిలో తన ప్రియుడితో సాగిస్తున్న రాసలీలలను కన్నబిడ్డ చూసింది. దీంతో తమ అక్రమ సంబంధం గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కన్నబిడ్డను ఆ కసాయి తల్లి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్‌లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఘాజీపూర్‌కు చెందిన మున్నిదేవి (30) వివాహితురాలి. ఓ కుమార్తె ఉంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన సుధీర్(22) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ మున్నిదేవి ఇంట్లో ముద్దూముచ్చట్లలో మునిగిపోయారు. ఈ దృశ్యాన్ని ఆమె కూతురు కాజల్ వెళ్లింది. తన ప్రియుడితో తల్లి కలిసి ఉండటాన్ని చూసిన కూతురు షాక్ అయింది. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని బెదిరించింది. దీంతో భయపడిన మున్నిదేవి... కూతురిని పట్టుకొని ఎవరికి చెప్పొద్దని ప్రాధేయపడింది. 
 
అయినప్పటికీ మున్నిదేవి మనసు కుదుటపడలేదు. విషయం బయటకు తప్పకుండా తెలుస్తుందనే అనుమానంతో ప్రియుడితో కలిసి కూతురిని చంపేసింది. దీనికి ప్రియుడు కూడా సహకరించాడు. ఆ తర్వాత తమకేం తెలియనట్టుగా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.
 
ఆ తర్వాత సాయంత్రానికి తన కుమార్తె కనిపించడం లేదనీ భర్తతో కలిసి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలోని ఇంటింటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాజల్ ఆచూకీ లభించలేదు. తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు గురువారం ఉదయం ఆమెను విచారించారు.

మొదట తన బిడ్డను చేతబడితో ఎవరో చంపారని చెప్పింది. చివరకు ప్రియుడితో కలిసి తన బిడ్డను చంపినట్లు మున్నిదేవి నేరం అంగీకరించింది. దీంతో మున్నిదేవితో పాటు.. ఆమె ప్రియుడు సుధీర్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ వొదినను పెళ్లాడు... తండ్రి బలవంతం... ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?