Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం... మంత్రి సోమిరెడ్డి

అమరావతి : రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంపుదలకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్ మెం

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (21:15 IST)
అమరావతి : రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంపుదలకు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్ మెంటల్ ప్రొగ్రామ్(unp) ముందుకొచ్చిందన్నారు. ఇందుకోసం ఆ సంస్థ ఆర్థిక సాయంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అందజేయనుందన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ నాలుగో బ్లాక్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం 974 గ్రామాల్లో లక్ష ఎకరాల్లో లక్షా 40 వేల రైతులతో సాగు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గితే, పర్యావరణం పరంగా కూడా ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేయడంలో ఆంధ్రప్రదేశ్... దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్‌మెంటల్ ప్రొగ్రామ్(unp)  ఏపీతో కలిసి పనిచేయడానికి ముందకొచ్చిందన్నారు. 
 
ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడిక్ సొలిహిమ్ నేతృత్వంలో ఒక బృందం రాష్ట్రానికి త్వరలో రానుందన్నారు. ఈ నెల 15 నుంచి 18 తేదీ వరకూ రాష్ర్టంలో కృష్ణాతో పాటు పలు జిల్లాల్లో ఆ సంస్థ బృందం పర్యటించనుందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు మరింత పెంచేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి అన్ని రకాల సాయం చేయనుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 974 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,900 పంచాయితీల్లో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచాలని ఆ సంస్థ భావిస్తోందన్నారు. 
 
ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.700 కోట్లు వెచ్చిస్తోందన్నారు. అజీమ్ ప్రేమ్ జీ సంస్థ కూడా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం సాగు చేయడానికి రూ.10 వేల కోట్లు వ్యయమవుతుందన్నారు. ఈ మొత్తం భరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్ మెంటల్ ప్రొగ్రామ్(unp) ముందుకొచ్చిందన్నారు. ఇదో పెద్ద ముందడగు అని మంత్రి తెలిపారు. రాబోయే అయిదేళ్లలో 5 లక్షల రైతులతో 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందున్నారు. 
 
ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్ మెంటల్ ప్రొగ్రామ్(unp) సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి తోడయితే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం సాగు చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తగ్గి, రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. రసాయనిక ఎరువులతో సాగు చేస్తే హెక్టార్ కు 400 కేజీలు ఉత్పత్తయితే, ప్రకృతి వ్యవసాయంలో 700 కేజీల పంట చేతికి అందుతోందన్నారు. 
 
గత నెలలో నెల్లూరు జిల్లాలలో వర్షాభావం కారణంగా రసాయనిక ఎరువులు వాడిన వరి పంట దెబ్బతింటే, ప్రకృతి వ్యవసాయంలో చేపట్టిన పంటకు ఎటువంటి నష్టమూ కలుగలేదన్నారు. ఈ పంటలు రెండూ ఒకే రైతుకు చెందినవన్నారు. కరవు పరిస్థితుల్లో కూడా ప్రకృతి వ్యవసాయానికి ఎటువంటి నష్టం కలుగడం లేదని రుజువైందన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పలు రకాల కాషాయాల తయారీపై ప్రత్యేక సీడీలు రూపొందించామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments